Sanitary Napkins | బస్టాండ్లలో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు
ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల్లో శానిటరీ నాపిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు సీతక, పొన్నం ప్రభాకర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సహేలీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తొలుత ములుగు, హనుమకొండ బస్టాండ్‌లో ఈ మిషన్లను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
- పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు సీతక్క, పొన్నం
Sanitary Napkins | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సహేలీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తొలుత ములుగు, హనుమకొండ బస్టాండ్‌లో ఈ మిషన్లను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలోనే ఆర్టీసీ బస్టాండ్‌లో తొలిసారిగా శానిటరీ నాపిన్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తెస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతున్నదని చెప్పారు. సహేలీ సంస్థ వ్యవస్థాపకురాలు కొమ్ము అనుపమకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

