GHMC | 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదు
GHMC | రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు.. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం కార్పొరేటర్లపై కేసులు నమోదు చేసినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిన్న 10 మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా, ఇవాళ మరో 22 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరికొంత మంది బీజేపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
దాడిని ఖండించిన కేటీఆర్
జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాల్లా వ్యవహరించారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ కార్పొరేటర్ల శుద్ధి కార్యక్రమం
బీజేపీ కార్పొరేటర్ల నిరసనను ఖండిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిసరాలతో పాటు లోగోను పాలతో శుభ్రం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ధర్నాను టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. బీజేపీ ధర్నా జీహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు అని కార్పొరేటర్లు పేర్కొన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. అభివృద్ధిని చూసి బీజేపీ కార్పొరేటర్లు ఓర్వలేకపోతున్నారు అని ధ్వజమెత్తారు. బీజేపీ కార్పొరేటర్లు పద్ధతి మార్చుకోవాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లు వార్నింగ్ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

