వనపర్తి శివారులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఒక్క రోజే పది పాములను పట్టాడు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్. ఇందులో 6 నాగుపాములు, 4 విషంలేని సర్పాలు ఉన్నాయి. వీటిని తిరుమలయ్యగుట్టల్లో వదిలిపెట్టారు. పాములు కనిపిస్తే.. వాటిని చంపకుండా 9985545526 నంబర్‌కు సమాచారం అందించాలని కృష్ణసాగర్ కోరారు. – వనపర్తి