Sabitha Indra Reddy | నా కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ చేసి పెట్టారట : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy | ఇవాళ సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టమొచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు.. వాళ్లు పార్టీ మారుతున్నారు.. వీళ్లు పార్టీ మారుతున్నారు అని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు అని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవికి రిజర్వ్ చేసి పెట్టారట. నా కుమారుడు కార్తీక్ రెడ్డి చెప్పిన మాదిరిగా చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
Sabitha Indra Reddy | హైదరాబాద్ : ఇవాళ సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టమొచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు.. వాళ్లు పార్టీ మారుతున్నారు.. వీళ్లు పార్టీ మారుతున్నారు అని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు అని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవికి రిజర్వ్ చేసి పెట్టారట. నా కుమారుడు కార్తీక్ రెడ్డి చెప్పిన మాదిరిగా చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో సబిత పాల్గొని ప్రసంగించారు.
తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా నా మనసు పులకరించిపోతోంది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం. గత 20 ఏండ్ల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ప్రతిపక్షంలో ఉండి ఎలా పోరాటం చేయాలో మీకు అందరికీ తెలుసు. ప్రజల కోసం పని చేయాలి. ఈ ఎన్నికల్లో మన పార్లమెంట్ ఏరియాలో ఏమన్న ఇబ్బంది ఉంటే చెప్పండి.. పరుగెత్తుకువస్తాం. కేసులకు భయపడేది లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న తట్టు తాకింది.. దాంతో వెనక్కి వెళ్లాల్సిన అసవరం లేదు. గట్టిగా పని చేసి కాసానిని గెలిపించి, కేసీఆర్ రుణం తీర్చుకుందాం. విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఎవరో మనకు తెలియకపోయినా కేసీఆర్ పంపించారు.. మనం గెలిపించాం. అంతో ఇంతో కాసాని మనతో మమేకమై పని చేస్తూ వస్తున్నారు. ఈ రోజు బడుగుల గొంతుక పార్లమెంట్లో వినిపించాలంటే ఆయనను గెలిపించాలి. కార్యకర్తల శక్తి ఏంటో ఇప్పుడు చూపించాలి. కేసీఆర్ అంటే ఏంటి..? కేసీఆర్ సైన్యం ఏంటో చూపించాలి. మాకు వచ్చిన మెజార్టీ కంటే కాసానికి డబుల్ మెజార్టీ రావాలి. ఇవాళ పార్టీ మారుతున్న వారంతా మానవత్వం లేని వారు అని సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

