పల్లెల సమగ్రాభివృద్ధే పల్లె ప్రగతి లక్ష్యం
మంత్రి ఎర్రబెల్లి | పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, హరితహారం, విద్యుత్ ప్రధాన ఎజెండాగా నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

మంచిర్యాల : పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, హరితహారం, విద్యుత్ ప్రధాన ఎజెండాగా నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వెంకట్రావుపేట గ్రామంలో బుధవారం పల్లె ప్రగతి గ్రామ సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధిపై దేశ అభివృద్ధి ఆధారపడుతుందనే సంకల్పంతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి 308 కోట్ల రూపాయలను ప్రతినెల గ్రాంట్‌గా గ్రామీణ స్థానిక సంస్థలకు మంజూరు చేస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు.
అందులో భాగంగా గత ఇరవై రెండు నెలల కాలంలో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి 6,500 కోట్ల రూపాయలు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. అంతకు క్రితం జోడు వాగుల గ్రామంలో హరితహారం కార్యక్రమంలో మంత్రులు మొక్కలను నాటారు. కిష్టంపేట గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

