పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతతకు నిలయాలుగా మారుతున్నాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతతకు నిలయాలుగా మారుతున్నాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో కలిసి పల్లెపకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు, విద్యుత్ సమస్యల పరిష్కారం, హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ, తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలి. పల్లె, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందుతున్నాయని తెలిపారు. అటవీ పునర్జీవన చర్యలో భాగంగా అడవుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. అలాగే నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తే అటవీ శాతం పెరుగుతుందన్నారు.

యాదాద్రి మోడల్ మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం వల్ల ప్రకృతి వనాలు చిట్టడవుల్లా మారుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజానికానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. గ్రామాల్లోని పారిశుధ్యంపై సర్పంచ్‌లు దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఏడో విడుత హరితహారంలో భాగంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. పూర్తైన పల్లె ప్రకృతి వనాలకు చుట్టూరా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి, కలెక్టర్ భారతీ హోళి కేరి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

