నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి
- 18 వరకు 15 రోజులు నిర్వహణ
- మండలాల్లో క్రీడా ప్రాంగణాలు
- పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం
- మండలం, వార్డుకో ప్రత్యేకాధికారి
- ప్రజలు, నాయకుల భాగస్వామ్యం
- ఉత్తమ సేవకులందించిన వారికి చివరిరోజు గుర్తింపు, సన్మానం
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే పల్లెప్రగతి ఐదో విడత, పట్టణప్రగతి నాలుగో విడతలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రధాన అంశాలు. నీరు, విద్యుత్తు సౌకర్యం లేని వైకుంఠధామాలకు వెంటనే ఆ సౌకర్యాలు కల్పిస్తారు. పల్లె, పట్టణ ప్రగతి పర్యవేక్షణకు మండలానికి జిల్లా స్థాయి అధికారి, వార్డుకు ప్రత్యేక అధికారి, పంచాయతీకి మండలస్థాయి అధికారిని నియమించారు. పంచాయతీ, పట్టణ వార్డు, డివిజన్‌కు కమిటీలను ఏర్పాటుచేశారు. గ్రామ కమిటీలో సర్పంచ్ అధ్యక్షుడిగా ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్తు లైన్, మిషన్ భగీరథ టెక్నిషియన్ సభ్యులుగా ఉంటారు. పట్టణస్థాయిలో వార్డు కమిటీల్లో కార్పొరేటర్, కౌన్సిలర్, కలెక్టర్ నియమించిన వార్డు సూపర్వైజర్, మున్సిపల్ శానిటరీ ఉద్యోగి, మున్సిపల్ వాటర్ సప్లయ్ ఉద్యోగి ఉంటారు.
గ్రామ సభతో ప్రారంభం
పల్లె, పట్టణ ప్రగతిలో మొదటి రోజు గ్రామంలో పాదయాత్ర చేపట్టి గ్రామసభ నిర్వహించాలని మార్గదర్శకాలు జారీచేశారు. పట్టణ ప్రగతిలో మొదటి రోజు వార్డు సభ నిర్వహించి ప్రణాళిక తయారు చేస్తారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలు, గత విడతల్లో సాధించిన విజయాలను నివేదిక రూపంలో వార్డు, గ్రామ సభలో చదివి వినిపిస్తారు. గ్రామ పంచాయతీ, పట్టణ స్టాండింగ్ కమిటీ సభ్యులంతా పాల్గొనేలా చూడాలి. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే సిద్ధం చేసిన క్రీడా ప్రాంగణాలను మొదటి రోజు ప్రారంభిస్తారు. మండలానికి కనీసం రెండు క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
చేపట్టే కార్యక్రమాలు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో అన్నిరోజులు రోడ్లను, మురుగు కాలువలను శుభ్రపరచాలి. పల్లె ప్రగతి జరిగే అన్ని రోజులు ఇండ్ల నుంచి మురుగు నీరు రాకుండా, నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి ఇంటికి మ్యాజిక్ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడాన్ని ప్రోత్సహించాలి.
- మురుగు కాలువల చివరన నీరు నిల్వ ఉండకుండా కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఒకరోజు నిర్మించాలి.
- అన్ని ప్రభుత్వ భవనాలు, మోటర్, హ్యాండ్ పంప్, పబ్లిక్ ట్యాప్, ట్యాంకుల, పబ్లిక్ ప్రదేశాలను సందర్శించి, వాటి నుంచి వచ్చే మురుగు నీరు నిల్వ ఉండకుండా కమ్యూనిటీ ఇంకుడు గుంతలను మరో రోజు నిర్మించాలి.
- గ్రామ, వార్డు పరిధిలోని రోడ్లను పరిశీలించి హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్‌కు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించాలి. మరో రోజు మిగతా ప్రదేశాల్లో హరితహారం ప్లాంటేషన్‌కు అనువైన స్థలాలను గుర్తించాలి.
- ఒక రోజు పవర్ డే పాటించాలి. ఆ రోజు నాటికి పెండింగ్‌లో ఉన్న విద్యుత్తు సమస్యలను పరిషరించాలి.
- రెండు రోజులు ప్రభుత్వ, ప్రజోపయోగ సంస్థలను శుభ్రం చేయడానికి కేటాయించాలి.
- నీటిపారుదలశాఖ సమన్వయంతో కాలువగట్లు, చెరువుగట్లు, ఆ శాఖ ప్రదేశాల్లో మొకలు నాటడానికి ప్రణాళిక తయారుచేయాలి.
- తాగునీటి వనరులను శుభ్రం చేయడానికి ఒక రోజు కేటాయించాలి.
- గ్రామ, పట్టణ డంపింగ్ యార్డు, వైకుంఠధామాన్ని ఒక రోజు సందర్శించాలి.
- పల్లె ప్రగతి చివరిరోజున గ్రామ సభ నిర్వహించి 15 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు ఓడీఎఫ్ ప్లస్ మాడల్ అర్హత సాధిస్తే, ఆ విషయాన్ని గ్రామసభలో ప్రకటించాలి. కార్యక్రమంలో అత్యుత్తమ సేవలను అందించిన అధికారులను, మిగతావారిని సన్మానించాలి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

