సైబర్ క్రైమ్ బాధితులకు రూ.7.9 కోట్లు రిఫండ్
వివిధ రకాల సైబర్ నేరాల బాధితుల ఖాతాల్లో రూ.7.9 కోట్లు రిఫండ్ చేసినట్లు టీజీసీఎస్బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) డైరెక్టర్ శిఖాగోయెల్ ఆదివారం తెలిపారు.
- మోసాలకు సీఎస్బీ అడ్డుకట్ట
- ‘లోక్‌అదాలత్’ ద్వారా న్యాయం
- 2,973 కేసులు పరిష్కారం
- పెండింగ్‌లో మరో 1,171 కేసులు
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : వివిధ రకాల సైబర్ నేరాల బాధితుల ఖాతాల్లో రూ.7.9 కోట్లు రిఫండ్ చేసినట్లు టీజీసీఎస్బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) డైరెక్టర్ శిఖాగోయెల్ ఆదివారం తెలిపారు. మోసపోయినట్టు తెలియగానే బాధితులు సత్వరం 1930కి కాల్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి డబ్బు వెళ్లకుండా టీజీసీఎస్బీ అడ్డుకున్నట్టు వివరించారు.
స్తంభింపజేసిన నగదును తిరిగి ఇప్పించాలని రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారికి శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్ ద్వారా రూ.7.9 కోట్లను వారి ఖాతాల్లోకి మళ్లించారు. ఈ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీజీఎల్ఎస్ఏ) సహకారం మరువలేనిదని శిఖాగోయెల్ తెలిపారు. సైబర్ నేరాల్లో డబ్బులు కోల్పోయిన కేసులు 4,144 నమోదవగా..శనివారం 2,973 కేసులను పరిష్కరించి డబ్బు వాపసు చేశారు. ఇంకా 1,171 కేసులు పెడింగ్‌లో ఉన్నట్లు శిఖాగోయెల్ వెల్లడించారు.
జాతీయ లోక్‌అదాలత్ ద్వారా ఒకేరోజు ఇంత పెద్దమొత్తంలో డబ్బులు బాధితుల ఖాతాలకు బదిలీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. గత మార్చిలో టీజీసీఎస్బీ, టీజీఎల్ఎస్ఏలు లోక్ అదాలత్ ద్వారా 803 కేసులను క్లియర్ చేసి, రూ.3,66,83,748 బాధితులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. వివిధ రూపాల్లో జరుగుతున్న సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని, తెలియని లింక్స్‌ను క్లిక్ చేయొద్దని, వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరు అడిగినా చెప్పొద్దని కోరారు. ఏదైనా సైబర్ నేరానికి గురైనట్టు అనుమానం వస్తే వెంటనే (గోల్డెన్ అవర్‌లోగా) 1930కి కాల్ చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

