‘పాలమూరు’కు రూ.587 కోట్లు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు చెల్లింపుల కోసం రూ.587 కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- భూసేకరణ నిధుల చెల్లింపునకు క్యాబినెట్ ఆమోదం
హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు చెల్లింపుల కోసం రూ.587 కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు తవ్వడంతో అందుకు సంబంధించి 5,337మంది భూనిర్వాసితులు ఉన్నారు. భూసేకరణ, పునరావాస చర్యలకు సంబంధించి మొత్తం 819.98 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
అందులో ఇప్పటికే కొంత మొత్తం చెల్లించగా, ఇంకా 587.27 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. అలాగే మరో 196 ఎకరాల భూ సేకరణకు అదనంగా రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఆ నిధుల చెల్లింపుకోసం ఇరిగేషన్‌శాఖ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ విస్తరణ పనులకు సంబంధించిన బడ్జెట్‌ను రూ.17కోట్ల నుంచి రూ.55.30 కోట్లకు సవరిస్తూ చేసిన అంచనాలకు కూడా క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

