విద్యార్థులపై ఆర్ఆర్ యాక్ట్ దుర్మార్గం
బ్యాంకులను లూటీ చేసి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి, దేశసంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రయోగించాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను పేద విద్యార్థులపై పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- జీవో-8, 9లను వెంటనే రద్దు చేయాలి
- పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేయాలి: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) హిమాయత్‌నగర్: బ్యాంకులను లూటీ చేసి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి, దేశసంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రయోగించాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను పేద విద్యార్థులపై పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవో-8, 9లను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే అమలుచేయాలని, వెంటనే రూ.8 వేల కోట్లకు పైచిలుకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ సర్కార్ వైఖరికి నిరసనగా గురువారం హిమాయత్‌నగర్‌లో తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ జేఏసీ నేత గుజ్జ కృష్ణ నేతృత్వంలో ఆందోళనకు దిగారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిం చారు. జీవో-8,9 కాపీలను చించివేశారు. ఈ సందర్భంగా శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. పాత బకాయిలు చెల్లించకుండా, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ నగదును విద్యార్థుల ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. పాత విధానంలోనే స్కీమ్‌ను కొనసాగించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

