శరవేగంగా రోడ్ల మరమ్మతులు
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 225 పనులు పూర్తికాగా, మరో 240 పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతు పనులను ఆర్అండ్బీ శాఖ గత మార్చి నెలలో చేపట్టింది.
- రూ.2,367 కోట్ల అంచనా
- 1,170 పనులు మంజూరు
- 225 పనులు పూర్తి
- కొనసాగుతున్న 240 రోడ్లు
- మే నెలాఖరుకల్లా పూర్తి
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 225 పనులు పూర్తికాగా, మరో 240 పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతు పనులను ఆర్అండ్బీ శాఖ గత మార్చి నెలలో చేపట్టింది. రోడ్ల మరమ్మతులకు రూ.1823 కోట్లు, కల్వర్టుల కోసం రూ.544 కోట్లు కలుపుకొని రూ.2367 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు.
ఈ మేరకు మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయించింది. తొమ్మిది పాత ఆర్అండ్బీ సర్కిళ్లకు మొత్తం 1,170 రోడ్డు మరమ్మతు పనులను మంజూరు చేశారు. వాటిలో 255 పనులు ఇంకా టెండర్ల దశలో ఉన్నాయి. 450 పనులు టెండర్లు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల అకాల వర్షాలతో మరమ్మతు పనులకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. వాతావరణం పొడిగా ఉంటే ఈ నెలాఖరుకల్లా మొత్తం పనుల్లో 50 శాతం పూర్తవుతాయని వారు పేర్కొన్నారు. మే నెలాఖరుకల్లా పనులన్నీ పూర్తి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

