Weather | పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అలర్ట్
Weather | రాష్ట్రంలో శనివారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీచేసింది.
Weather | ఎండకాలం ప్రారంభంలోనే భానుడు భగభగ మంటున్నాడు. జనాలు బయటికి రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో శనివారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీచడం వల్ల వచ్చే అయిదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి.
సిద్దిపేట జిల్లాలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో 38.7 డిగ్రీలు, మెదక్ జిల్లా శివ్వంపేటలో 37.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎండ వేడికి ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఇదిలా ఉంటే వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఐఎండీ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్నం అధ్యక్షతన జరిగిన సదస్సుకు పర్యావరణ వేత్త, వర్షపు నీరు ప్రాజెక్ట్ ఫౌండర్ కల్పన రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీటి సంరక్షణ సవాలు అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించిన కల్పన రమేశ్.. భవిష్యత్ తరాలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
‘అపార్ట్‌మెంట్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఎందుకు కొనుగోలు చేస్తున్నాం అని అనిపించేది. వివిధ చోట్ల గత అయిదారు నెలల నుంచి ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నాం. ఈ వాటర్ ట్యాంకర్లు తీసుకువస్తున్న డ్రైవర్లను వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగా. కానీ ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇతర వనరుల ద్వారా తీసుకు వస్తున్నారని అర్థమైంది` అని పర్యావరణ వేత్త కల్పన రమేశ్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

