ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి బంద్
రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్‌కు పౌరసరఫరాల సంస్థ చేస్తున్న బియ్యం ఎగుమతి నిలిచిపోయింది. ఐదు నెలలుగా ఒక్క బియ్యం గింజ కూడా ఎగుమతి కాలేదు. దీంతో తుదిపరి ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
- ఐదు నెలలుగా నిలిచిపోయిన ఎగుమతి
- 8 లక్షల టన్నులని.. 22 వేలతోనే సరి
- తదుపరి ఎగుమతులపై నీలినీడలు
- తొలి షిప్‌ను ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
- ఆదాయం తెస్తామని నాడు గొప్పలు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్‌కు పౌరసరఫరాల సంస్థ చేస్తున్న బియ్యం ఎగుమతి నిలిచిపోయింది. ఐదు నెలలుగా ఒక్క బియ్యం గింజ కూడా ఎగుమతి కాలేదు. దీంతో తుదిపరి ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేస్తామంటూ చెప్పిన ప్రభుత్వం.. కేవలం 22 వేల టన్నులతోనే సరిపెట్టడం గమనార్హం. గతంలో ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో కీలకంగా వ్యవహరించిన అధికారి బదిలీ కావడం దీనిపై ప్రభావం చూపిందనే చర్చ సివిల్సైప్లెలో జరుగుతున్నది. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా ఉంటుందని, విదేశాలకు ఎగుమతి చేస్తే ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆలోచించింది.
ఇందులో భాగంగానే మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఫిలిప్పీన్స్‌తో బియ్యం ఎగుమతులపై ఒప్పందం చేసుకున్నది. మొత్తం 8లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం చేసుకోగా, తొలి విడతలో లక్ష టన్నులు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న 12,500 టన్నుల బియ్యం ఎగుమతి ప్రారంభించారు. తొలి లోడ్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాకినాడ పోర్ట్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. విదేశాలకు బియ్యం ఎగుమతికి ఒక మార్గాన్ని ఏర్పాటుచేశామని చెప్పారు.
ఈ ఎగుమతుల ద్వారా సివిల్‌సైప్లె సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుతామని తెలిపారు. ఇవేవీ జరగకపోవడం గమనార్హం. ఆ తర్వాత జూన్‌లో 10 వేల టన్నులు ఎగుమతి చేశారు. ఆ తర్వాత ఎగుమతి నిలిచిపోయింది. ఇదిలా ఉండగా తొలి విడతలో భాగంగా వేలం ధాన్యంలోని లక్ష టన్నులను బియ్యంగా మార్చి ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఒకవైపు బిడ్డర్లు టెండర్ ధాన్యం ఎత్తకపోవడంతో సంస్థకు నష్టం వాటిల్లుతున్నది. ఇది తగ్గించుకునేందుకు వేలం ధాన్యంలో లక్ష టన్నులను ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఇది కూడా ఎగుమతి చేయకపోవడంతో సంస్థకు నష్టాలు తప్పడంలేదు. అటు ఎగుమతి చేయలేక, ఇటు బిడ్డర్లు ఎత్తక సివిల్సప్లయ్కి భారీ మొత్తంలో నష్టాలొస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

