హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆటోమొబైల్ రంగంలో స్టార్టప్‌లకు టీ హబ్‌గా అండ గా నిలుస్తున్నది. ఇందులో భాగంగానే ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలైన రెనాల్ట్ నిస్సాన్‌తో కలిసి ఆటోమోటివ్ రంగంపై స్టార్టప్ నిర్వహిస్తున్న వారికి ఓపెన్ చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. గ్రోత్ స్టేజ్‌లో ఉన్న స్టార్టప్‌లు కొత్త టెక్నాలజీ అయిన జెనరేటివ్ ఏఐతో పరిష్కారాలు చూపే వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు https://bit.ly/3TlSTnnలో సంప్రదించాలని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.