B(T)RS | బీ(టీ)ఆర్ఎస్ తో దేశంలో విప్లవాత్మక మార్పు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
B(T)RS |బీ(టీ)ఆర్ఎస్ జాతీయ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పు రానుందని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ : బీ(టీ)ఆర్ఎస్ జాతీయ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పు రానుందని అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం బోథ్ మండలం ధన్నూరు గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఅర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఅర్ 14 సంవత్సరాల పాటు అలుపెరగకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. అనేక అభివృద్ధి , సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎంతో మంది కోరుకోవడంతో జాతీయ పార్టీని ప్రకటించా రని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందేందుకు బీజీపీ కేంద్ర మంత్రులు ఇక్కడ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్యా రాణి, ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, బోథ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు.. కలుపుమొక్క కాంగ్రెస్‌ను నమ్మితే సంక్షేమం సర్వనాశనమైంది : కేటీఆర్
Ranganath | హైడ్రా రంగనాథ్‌ను హైకోర్టుకు పట్టుకురండి.. డీజీపీకి న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్‌రెడ్డి ఆదేశం
Intermediate Education | ఇంటర్ విద్య రద్దు.. పీవీపై అక్కసుతోనే నిర్ణయమన్న ఇంటర్ జేఏసీ
IPL Player Trade | డీల్ డన్.. పాండ్యా, అర్ష్‌దీప్ ట్రేడింగ్‌కు ఆమోదం.. మళ్లీ రోహిత్‌కే ఎంఐ పగ్గాలు?
Ambulance Shortage | కొడంగల్ క్రిటికల్ కేర్..ట్రాక్టరే అంబులెన్స్ రేవంత్ ఇలాకాలో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

