Minister Gangula | భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం: మంత్రి గంగుల కమలాకర్
Minister Gangula | సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఆలయాల పునరుద్ధణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్ : సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఆలయాల పునరుద్ధణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రేకుర్తిలో నిర్మిస్తున్న లక్ష్మి నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని వెల్లడించారు.
ఈ నెల 24న స్వామి వారి ఆలయానికి గోపుర గడప నిర్మాణం చేపడుతున్నామన్నారు.
నెలన్నర రోజుల్లోగా పనులు పూర్తి చేసి స్వామి వారి దర్శనానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాదగిరిగుట్ట(Yadagirigutta)ను సౌత్ ఇండియాలోనే గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. కొండగట్టు ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ రేకుర్తిలోని గుట్ట పై స్వయంభువుగా వెలిసిన లక్ష్మినరసింహ స్వామి(Laxmi Narasimha swamy) వారి ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో స్వామి వారు శంఖు ,సుదర్శన చక్రాలతో స్వయంభువుగా వెలిసిన మహిమాన్వితమైన ఆలయమన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) సహకారంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు రూ. 20 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు ఆలయాన్ని నిర్మించామన్నారు. మంత్రి వెంట నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం : Brahmotsavam | ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్వహణ బాధ్యతలు తాసీల్దార్‌కు అప్పగింత
‘ఇందిరమ్మ బీమా ప్రతి ఇంటికి ధీమా’
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

