కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. హోంగార్డు ప్రస్తావన, చండూరు సభలో వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి క్షమాపణ చెబుతున్నట్లు రేవంత్ తన వీడియోలో పేర్కొన్నారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని రేవంత్ అన్నారు.
చండూరు సభలో తనను అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకు మునుగోడుకు దూరంగా ఉంటానని ఎంపీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్య రేవంత్ ఓ మెట్టు దిగి కోమటిరెడ్డికి క్షమాపణలు చెప్పారు.
రేవంత్ రెడ్డి విడుదల చేసిన వీడియో సారాంశం..
ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం వాడటంతో వారు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డిని అవమానించే విధంగా ఎవరూ మాట్లాడిన తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సూచన చేయడం జరుగుతందని రేవంత్ రెడ్డి తన వీడియోలో పేర్కొన్నారు.
My apologies to brother and colleague @KomatireddyKVR garu. @manickamtagore @UttamINC pic.twitter.com/v7gkvXtlRD
— Revanth Reddy (@revanth_anumula) August 13, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

