రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందా!.. అన్నదాతల భూములను గుంజుకుంటున్రు
బుల్లెట్‌ట్రైన్ పేరిట దౌర్జన్యంగా సేకరణ.. బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత సబితాఇంద్రారెడ్డి.. రియల్ ఎస్టేట్ కోసమే భూసేకరణ : పట్నం.. పీవీ విగ్రహాన్ని ఎందుకు తొలగించారు?: వాణీదేవి
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్న రేవంత్ సర్కార్.. ఆ భూములతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నదని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రై తుల భూములను బలవంతంగా సేకరిస్తూ భయపె డ్తున్నదని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? అని నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆమె పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ చేపట్టడంపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అలైన్మెంట్ ఇంకా ఖరారు కాలేదని రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ స్పష్టం చేశారని, ఆ ప్రాజెక్టు కోసం భూములు సేకరించాలని రాష్ట్ర ప్ర భుత్వానికి కేంద్రం చెప్పలేదని కూడా ఆయన వెల్లడించారని గుర్తుచేశారు. మరి ప్రాజెక్టును ఎకడ నిర్మిస్తారో స్పష్టత లేకున్నా బహదూర్‌గూడ రైతుల భూములను పోలీసుల పహారాలో ఎందుకు స్వా ధీనం చేసుకున్నారని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
భూసేకరణకే సీఎం ప్రాధాన్యం : మంచిరెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదని, భూసేకరణకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించా రు. ప్రజల సమస్యలు, రైతుల సంక్షేమాన్ని పకనబెట్టి భూముల సేకరణపై దృష్టిపెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రైతులు సుమారు 14వేల ఎకరాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఐదేండ్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయకపోతే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని అప్పటి గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు తెలిపారు. ఇప్పుడు ఫార్మాసిటీని రద్దుచేసి, దాని పకనే మరో 2,500 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. ప్రజాభిప్రా య సేకరణ లేకుండా ప్రక్రియను గోప్యంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు.
రియల్ ఎస్టేట్ కోసమే భూసేకరణ: నరేందర్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పెద్దమొత్తంలో భూసేకరణ చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ర్టానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్తున్నదని, అయితే క్షేత్రస్థాయిలో ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎంతమందికి ఉ ద్యోగాలు కల్పించారు? అని ప్రశ్నించారు. కొడంగల్‌లో వెంకటయ్య అనే రైతు భూమి ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన పొలానికి విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై అ ధికారులు వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చే శారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూ సే కరణ వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలని కోరారు.
పీవీ విగ్రహాన్ని ఎందుకు తొలగించారు?: ఎమ్మెల్సీ వాణీదేవి
కేబీఆర్ పారు పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అస్తవ్యస్త పాలనకు అద్దంపడుతున్నాయని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి విమర్శించారు. కేబీఆర్ పారు సమీపంలో ఉన్న మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆమె ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. కనీస సమాచారం ఇవ్వకుండా భూసేకరణ చేపట్టడం సరికాదని, ప్రజలకు ముంద స్తు సమాచారం అందించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

