రేవంత్‌కూ హిట్లర్‌కు పట్టిన గతే.. గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్
హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిట్లర్ వారసుడని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి తెలంగాణకు సీఎం కావడం మన దౌర్భాగ్యమని పేర్కొన్నారు.
- అతడి వారసుడు రాష్ర్టానికి సీఎం కావడం దౌర్భాగ్యం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిట్లర్ వారసుడని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి తెలంగాణకు సీఎం కావడం మన దౌర్భాగ్యమని పేర్కొన్నారు. కోట్లాది మందిని ఊచకోత కోసిన నరరూప రాక్షసుడు తనకు రోల్ మాడల్ అని రేవంత్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చండి.. పేదల ఇండ్లు కూల్చివేయండి అంటూ రేవంత్ నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. సోనియాని బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి.. గాంధీ పార్టీలో పుట్టానని, సోనియా గాంధీ దేవత అంటూ సోయితప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ నాయకత్వం ఎలా భరిస్తున్నదని ప్రశ్నించారు.
మోదీని భుజాల మీద ఎక్కించుకుంటున్న అదే రేవంత్ బీజేపీలో ఎప్పుడు చేరుతారో చెప్పాలని అన్నారు. మోదీతో మంచి సంబంధాలుంటే ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేపట్టకుండా రైతులను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ప్రశ్నించారు. సింగరేణిలో కేసీఆర్ తీసుకొచ్చిన వారసత్వపు ఉద్యోగాలు పోగొట్టి, సైట్ విజిట్ పేరుతో బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

