హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖ ఇంచార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హనుమంతరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ సూచనల మేరకు ఈ నియామకం జరిగినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఆసిఫాబాద్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల జడ్జిగా, వరంగల్ సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పనిచేసిన రవీంద్రశర్మ ఈ ఏడాది జనవరిలో హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఉద్యోగ విరమణ చేశారు.
గత కొన్ని రోజులుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉండటంతో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు రవీంద్రశర్మ నియామకంతో ఆ కేసులు త్వరగా పరిష్కారమవుతాయని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.