కరోనా ఎఫెక్ట్.. హోలీ వేడుకలపై ఆంక్షలు
హోలీ వేడుకలు | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హోలీ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హోలీ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హోలీ వేడుకలపై ఆంక్షల నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఈవెంట్స్ ఆర్గనైజర్లకు, హాస్టల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వెళ్లే వ్యక్తులపై, వాహనాలు, స్థలాలపై రంగులు, రంగునీళ్లు చల్లవద్దని, ద్విచక్రవాహనాలు, కార్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్
హోలీ పండుగ సందర్భంగా రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా రేపు ఎల్లుండి అంటే.. ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

