వేములవాడ, కొమురవెల్లి ఆలయాల్లో కొవిడ్ ఆంక్షలు
restrictions in temples due to covid |

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకొని ఆలయాల్లో అధికారులు కొవిడ్ ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చారు. వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 13న ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఆంక్షలు తీసుకువచ్చారు.
ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలో భక్తులను అనుమతించడం లేదని చెప్పారు. స్వామివారికి ఏకాంతంగానే పూజలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే కొమురవెల్లి మల్లన్న ఆలయం కొవిడ్ ఆంక్షలను అధికారులు అమలులోకి తీసుకువచ్చారు. రెండు డోసుల టీకా సర్టిఫికెట్ ఉన్న భక్తులకే మల్లన్న దర్శనం కల్పిస్తామని చెప్పారు. మల్లన్న జాతర రద్దీ దృష్ట్యా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 16న జాతర ప్రారంభం కానుండగా.. మూడు నెలల పాటు కొనసాగనున్నది. ఈ క్రమంలో జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 17న నిర్వహించాల్సిన పట్నం, అగ్నిగుండాలను అధికారులు రద్దు చేశారు. జగిత్యాల కొండగట్టు ఆంజనేస్వామి సన్నిధిలోనూ కరోనా నేపథ్యంలో పలు వేడుకలకు భక్తులను అనుమతించొద్దని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో అర్చకులు, అధికారులకే అనుమతి ఇచ్చారు. గోదా రంగనాథ స్వామి కల్యాణానికి సైతం భక్తులను అనుమతించొద్దని, కొవిడ్ నిబంధనల ప్రకారం సాధారణ దర్శనాలకు అనుమతి లేదని చెప్పారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అన్ని వేడుకలను భక్తులు లేకుండానే నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

