నమస్తే తెలంగాణ కథనానికి స్పందన..పేద కుటుంబానికి ఆర్థిక సాయం
నమస్తే తెలంగాణ కథనానికి స్పందన | పెద్దపల్లి జిల్లాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థి దుస్థితిపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యార్థులు స్పందించారు.

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థి దుస్థితిపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యార్థులు స్పందించారు. తమ వంతు సాయంగా ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన పుల్లెల సదానందం కుమారుడు పుల్లెల విష్ణు బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు.
తనకి బోన్ న్యారో సర్జరీ చేస్తే ప్రాణపాయం నుంచి బయటపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అందుకోసం రూ.20 లక్షల వరకి అవసరం అని తెలిపారు. దీంతో పుల్లెల విష్ణు చదివిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల నుంచి సేకరించిన విరాళాలు రూ.50,000 విష్ణు పెద్ద నాన్న పుల్లెల కొంరయ్యకి అందించి విద్యార్థులు తమ పెద్ద మనసును చాటుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, డైరెక్టర్స్ శ్రీధర్, రంజిత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

