కవాడిగూడ, మార్చి 26: దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ జాతీయ చైర్మన్ ఎర్రతోట రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం దోమలగూడలోని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ జాతీయ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లునావత్ సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంపా తిరుపతయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.