మిషన్ భగీరథ కార్మికుల వేతనాలపై నివేదిక ఇవ్వండి
మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
- ఇంటింటి సర్వే వివరాలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించండి
- అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశం
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మిషన్ భగీరథపై అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పథకం సిబ్బంది జీతాలు నెలల తరబడి పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయని భట్టి ప్రశ్నించారు.
ఒకో ప్రాంతంలో ఒక్కోరకంగా వేతనాలు ఉన్నాయని, రూ. 8 వేల నుంచి రూ. 13 వేల వరకు అందుతున్నట్టు తనకు సమాచారం ఉన్నదని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా వేతనాలు ఉండేలా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై నిర్వహిస్తున్న సర్వే పూర్తికాగానే వివరాలను స్థానిక ఎమ్మెల్యేలకు అందజేయాలని సూచించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి స్మితాసబర్వాల్, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాసర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

