బీ క్యాటగిరీ సీట్ల అక్రమ భర్తీకి చెక్ పడేనా?
బీటెక్ మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్ల భర్తీలో అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై ఈ ఏడాదైనా సర్కారు కొరడా ఝళిపించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
- నోటిఫికేషన్ రాకముందే సీట్ల భర్తీ
- ఆన్లైన్, నోటీస్ బోర్డులో వివరాలు చూపని కాలేజీలు
- చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): బీటెక్ మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్ల భర్తీలో అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై ఈ ఏడాదైనా సర్కారు కొరడా ఝళిపించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. బీ క్యాటగిరీ సీట్ల భర్తీకి జారీచేసే నిబంధనలను పాటించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం కాలేజీలు మూడు భాషల దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీచేయాలి. ఆయా నోటిఫికేషన్లో వివరాలను ప్రస్ఫుటంగా పేర్కొనాలి. యాజమాన్యాలు ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో వచ్చే దరఖాస్తులన్నింటిని స్వీకరించాలి. కోర్సుల వారీగా దరఖాస్తు చేసిన విద్యార్థుల జాబితాను వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతోపాటు, నోటీస్బోర్డులోనూ పొందుపరచాలి. కానీ ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. నోటిఫికేషన్ రాకముందే పలు కాలేజీల్లో సీట్ల కోసం వెళితే లేవన్న మాటలే వినిపిస్తున్నాయి. అంటే నోటిఫికేషన్‌కు ముందే సీట్లు భర్తీ అయిపోయాయి. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. కాగా, ఇంజినీరింగ్ బీ క్యాటగిరీ సీట్ల భర్తీకి వారంలో నోటిఫికేషన్ విడుదలకానుంది. కన్వీనర్ కోటా మొదటి విడత సీట్లను 19లోపు కేటాయిస్తారు. బీ క్యాటగిరీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ను జారీచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.
ఉచిత శిక్షణకు 18న స్పాట్ అడ్మిషన్లు
హైదరాబాద్, జూలై15 (నమస్తే తెలంగాణ): ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ యువతకు 18న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నది. తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 3 నెలల వ్యవధితో ఫార్మసీ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు సంబంధించి ఎస్సెస్సీ అర్హత ఉండాలని వివరించారు. 12 నెలల అడ్వాన్స్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలని తెలిపారు. 18 -35 ఏండ్ల నిరుద్యోగులు 18న వనస్థలిపురం బాటా షోరూం, 4ఫ్లోర్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు నేరుగా హాజరుకావాలని కోరారు. వివరాలకు 98485 81100, 90599 02355 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కాంట్రాక్టు పద్ధతిలో ఎగ్జిక్యూటివ్, డిజైనర్ పోస్టులు
హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని చేనేత జౌళి శాఖలో 8 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, 22 టెక్స్టైల్ డిజైనర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. మూడేండ్లకు గానూ మొదటి సంవత్సరం నియమించుకొని పనితీరు ఆధారంగా పొడిగిస్తారు. సీడీఈ పోస్టులకు ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లోమా ఉత్తీర్ణతతోపాటు రెండేళ్లు సీడీఈగా పనిచేసిన అనుభవం ఉండాలి. టెక్స్టైల్ డిజైనర్ పోస్టులకు నిఫ్ట్/ఎన్ఐడీ లేదా పేరున్న సంస్థ నుంచి డిజైనింగ్‌లో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. నెలకు రూ.24,000 వేతనం ఇస్తారు. ఔత్సాహికులు 21 రోజుల్లోగా నాంపల్లిలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో బయోడేటా ఇవ్వాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

