హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మోడల్ సూల్ టీచర్ల సమస్యల పరిషారానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. విద్యాశాఖ కమిషనర్ దేవసేన టీచర్ల సీనియారిటీ జాబితాను ఆదివారం విడుదల చేశారు. దీంతో తెలంగాణ ప్రోగ్రెసివ్ మోడల్ సూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ హర్షం వ్యక్తం చేశారు. సీనియారిటీ జాబితా విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన, మోడల్ సూల్స్ అదనపు సంచాలకుడు రమణకుమార్ తదితర ఉన్నతాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.