ప్రభుత్వ పథకాలతో బాల్యవివాహాలు తగ్గుదల: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో బాల్యవివాహాలు
రంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గాయని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వార ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.
ఎనిమిది సంవత్సరాల కాలంలో 2020 మందికి గాను రూ.21కోట్ల రూపాయల చెక్కులను అందజేశామన్నారు. పేదింటి ఆడ బిడ్డలకు ముఖ్య మంత్రి కేసీఆర్ మేనమామలాగా ఆదుకుంటున్నారని తెలిపారు. ధరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి పథకం వలన లబ్ధి చేకూరిందన్నారు.
ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలు లబ్ధి దారులకు చేరుతున్నాయన్నారు. అమ్మాయిలలో అక్షరాస్యత శాతం పెరగడమే కాకుండా ఉన్నత చదువులపై దృష్టి సారించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీసునితా అంధ్యనాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

