Heavy Rains | భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలంగాణకు రెడ్ అలర్ట్ : వాతావరణ శాఖ
Heavy Rains | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) హెచ్చరించింది.
Heavy Rains | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రం అంతటికీ రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
మరోవైపు హైదరాబాద్ (Hyderabad), హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని నాగరత్న వివరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read..
తరాలు మారినా మారని బతుకులు.. భారీ వర్షాలతో వరదలు.. గర్భిణికి అవస్థలు
Heavy Rain | హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. సాయంత్రానికి దంచికొట్టనున్న వాన..!
కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణ 6 వారాలు వాయిదా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
KTR | రోత భాష ఏందీ రేవంత్.. కరువు, కన్నీళ్లతో బాధపడుతుంటే చిల్లర మాటలతో చిందులా??.. కేటీఆర్ ఫైర్
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

