తరాలు మారినా మారని బతుకులు.. భారీ వర్షాలతో వరదలు.. గర్భిణికి అవస్థలు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలవల్ల నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న కల్వర్ట్ పైనుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దాంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దొడ్డిగూడెంలో తొమ్మిది నెలల గర్భిణి యమునకు పురిటి నొప్పులు వచ్చాయి.
తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలవల్ల నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న కల్వర్ట్ పైనుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దాంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దొడ్డిగూడెంలో తొమ్మిది నెలల గర్భిణి యమునకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను వాగు దాటించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
గర్భిణికి పురిటి నొప్పుల విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్.. పోలీస్ సిబ్బందిని, ఈతగాళ్లను ఘటనాస్థలికి పంపారు. వారు తాళ్ల సాయంతో గర్భిణిని వాగు దాటించి అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ పరిస్థితికి కారణం సింగరేణి సంస్థనే అని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. వాగుకు అడ్డంగా మట్టి పొయ్యడంవల్ల దాదాపు 6 మీటర్ల ఎత్తున ఉన్న బ్రిడ్జి పూర్తిగా మట్టితో నిండిపోయిందని, దాంతో వరద నీరు బ్రిడ్జి మీది నుంచి పోతోందని, అందుకే గర్భిణి అవస్థలు పడాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు.
ఆదివాసీ గూడేలపై సింగరేణి అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన అద్దంపడుతోందని ఆదివాసీలు మండిపడుతున్నారు. ఏ ఒక్క ప్రాణం పోయినా దానికి బెల్లంపల్లి ఏరియా ఉన్నతాధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని గొండ్వానా పంచాయతీ, రాయ్ సెంటర్ నర్సాపూర్ సభ్యుడు మడావి అమృతరావు డిమాండ్ చేశారు. ఆదివాసీల భూములు కావాలి కానీ, ఆదివాసీల కష్టాలు, అభివృద్ధి మీకు పట్టదా..? అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే హైలెవల్ వంతెన నిర్మాణాన్ని చేపట్టకపోతే నూతనంగా ఏర్పాటుచేసే అబ్బాపూర్ ఓసీని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా గర్భిణి యమున బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాడు సహాయంతో గర్భిణీ మహిళను వాగు దాటించిన పోలీసులు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న నర్సాపూర్ వాగు
పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీ మహిళను తాడు సహాయంతో వాగు దాటించిన పోలీసులు, గ్రామస్తులు pic.twitter.com/AQPU3Mybz1
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

