మంత్రులు బైపాస్
ఇటీవల ప్రభుత్వం భారీ సంఖ్యలో కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ బదిలీలను చూసి దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి అవాక్కయ్యారట.
- అధికారుల పోస్టింగ్‌లలోనూ అదే తీరు
- మంత్రుల జాబితాలు బుట్టదాఖలు
- సొంత జిల్లాల్లోనే అధికారుల మార్పులు
- జీవోలు చూసి అవాక్కవుతున్న మంత్రులు
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఇటీవల ప్రభుత్వం భారీ సంఖ్యలో కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ బదిలీలను చూసి దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి అవాక్కయ్యారట. తాను చెప్పిన వ్యక్తి పేరు కాకుండా కొత్త పేరు కనిపించడంతో.. ఇదెలా జరిగిందని రుసరుసలాడుతున్నారట. మరో మంత్రికైతే సొంత జిల్లా కలెక్టర్‌ను మారుస్తున్న విషయమే తెలియదని సమాచారం. ఐఏఎస్‌లు మాత్రమే కాదు.. మండల స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఇదే తంతు. తమకు ఫలానా అధికారులు కావాలని పలువురు మంత్రులు చేస్తున్న సిఫారసులు బు ట్టదాఖలవుతున్నాయని కొత్త చర్చ నడుస్తున్నది.
మంత్రుల ఆదేశాల మేరకే ఆయా శాఖల్లో ప్రాథమికంగా జాబితా సిద్ధమవుతున్నదని.. అయితే సీఎం ఆఫీసుకెళ్లిన తర్వాత మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. మారిన విషయం మంత్రులకు తెలియడం లేదని, జీవోలు విడుదలైన తర్వాత వాళ్లు అవాక్కవుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రభుత్వం ఓ సలహాదారును నియమించింది. ఆయన నియామకం సదరు శాఖ మంత్రికి తెలియదని తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆయన ఓ సమాశంలో ఉండగానే ఓ అధికారి ఈ నియామకంపై మంత్రికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. తన శాఖలో తనకు తెలియకుండానే సలహాదారులను నియమించడమేంటని ఆయన అసహనం వ్యక్తం చేశారని అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
కింది స్థాయి అధికారుల్లోనూ..
కోడ్ పూర్తయిన నేపథ్యంలో తమను తిరిగి వెనక్కి పంపాలని పలు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే ఎవరెవరు వెళ్తారనేది ఓ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. రెవెన్యూ శాఖకు చెందిన ఓ సం ఘం నాయకులు మాట్లాడుతూ.. ‘మేం జా బితా సిద్ధం చేసి పంపుతాం. మంత్రి ఆమోదిస్తారు. కానీ సీఎంవోలో మార్పులు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

