తెలంగాణ ఏర్పాటైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందన్నారు.. నిర్మాణ రంగం కుప్పకూలుతుందని భయపెట్టారు. ఆ అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతున్నది హైదరాబాద్ నగరం. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టే ప్రధాన కారణం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న అనేక ప్రాజెక్టులతో పాటు ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రియల్ ఎస్టేటే కాకుండా నిర్మాణం, ఇంటీరియర్ వంటి వివిధ రంగాల్లో గ్లోబల్ స్థాయి దిశగా నగరం పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పాటు సమయంలో అపోహలు సృష్టించిన అబద్ధాల కోరులకు చెంపచెళ్లు మనేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతు తెలుపుతూ.. కారు గుర్తుకు ఓటు వేయాలి.
– ఎంవీ అజయ్‌కుమార్ (అజయ్ అసోసియేట్స్) కిస్మత్పూర్, రాజేంద్రనగర్