Reading campaign | పాఠశాలల్లో పఠనోత్సవం.. రేపటి నుంచి జూలై 31 వరకు బడుల్లో రీడింగ్ క్యాంపెయిన్
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడం, స్వతంత్య్రంగా చదివే పాఠకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
- రోజుకొక పీరియడ్ చొప్పున కేటాయించాలని సర్కారు ఆదేశం
- మార్గదర్శకాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
Reading campaign | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడం, స్వతంత్య్రంగా చదివే పాఠకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పఠనోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించింది. సోమవారం నుంచి జూలై 31 వరకు బడుల్లో రీడింగ్ క్యాంపెయిన్‌ను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. 1వ తరగతి విద్యార్థులు సరళ పదాలు, 2వ తరగతి విద్యార్థులు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు, వ్యాక్యాలను ధారాళంగా చదివేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. 3వ ఆపై తరగతుల విద్యార్థులు అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలతోపాటు కథల పుస్తకాలు, బాల సాహిత్యాన్ని, వార్తాపత్రికలను ధారాళంగా చదివేలా తీర్చిదిద్దాలను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐదువేల బడుల్లో గ్రంథాలయాలను ప్రారంభించారు. వీటిల్లో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో పెట్టారు. రీడింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా రోజుకొక పీరియడ్‌ను కేటాయించి చదివించాలని ఆదేశాలిచ్చారు.
పాఠశాలల్లో పఠనోత్సవం సాగుతుంది ఇలా..
- మొదటి వ్యూహంలో భాగంగా 10 నిమిషాలపాటు బాహ్యపఠనం.
- కీలక పదాలను బ్లాక్‌బోర్డుపై రాయడం, చార్టులపై రాయడం.
- మాడల్ రీడింగ్ అలవాటు చేయించడం, భాగస్వామ్య పఠనం, వ్యక్తిగత బాహ్యపఠనం.
- రెండో వ్యూహంలో భాగంగా గ్రంథాలయంలోని పుస్తకాలను చదివేందుకు ఒక పీరియడ్‌ను కేటాయిస్తారు. కథల పుస్తకాలను చదివిస్తారు. మూడు రోజులు మాతృభాష కథల పుస్తకాలు, మరో మూడు రోజులు ఆంగ్లభాషా పుస్తకాలను చదివిస్తారు.
- ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు పిల్లలతో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేస్తారు.
- రీడథాన్ను ద్వారా చదవడంలో పిల్లలకు పోటీ నిర్వహిస్తారు.
- బడుల్లో రీడింగ్ కార్నర్లు సహకారాన్ని అందిస్తాయి. వీటిలో మ్యాగ్జిన్లు, వార్తాపత్రికలు, భాషాక్రీడలు, పద పట్టికల వంటి సామగ్రిని సమకూరుస్తారు.
- పాఠశాల అసెంబ్లీలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులతో కథల పుస్తకాలు చదివించి అంతా చదివే అవకాశాన్నిస్తారు. విద్యార్థులు చదువుతున్నప్పుడు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలతోపాటు తల్లిదండ్రలకు పంపిస్తారు.
- పఠన పోటీలను నిర్వహించి కొంత సమయం గడువిచ్చి సరిగ్గా, తప్పుల్లేకుండా చదివేలా ప్రోత్సహిస్తారు. అభినందిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

