హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్ నెట్వర్ అయిన ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్ (టై) హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలిగా రషీదా ఆడెన్వాలా నియమితులయ్యారు. ఈ మేరకు టై ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 1992లో సిలికాన్ వ్యాలీలో స్థాపించిన ఈ సంస్థ.. అన్ని పరిశ్రమల్లో, అన్ని దశల్లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సహకారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నది. ఇది 14 దేశాల్లోని 63 నగరాల్లో విస్తరించడంతోపాటు, 15,000 మందికి పైగా గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్స్ నెట్వర్ను కలిగి ఉన్నది. టై శాఖల్లో హైదరాబాద్ చాప్టర్ అత్యంత శక్తివంతమైనది.
ఈ సంస్థకు తొలి మహిళ, నూతన అధ్యక్షురాలిగా రషీదా ఆడెన్వాలా నియమితులయ్యారు. ఆమెకు టై ప్రతినిధులు సురేశ్రాజు, శ్రీని చందుపట్ల, ఇతర బోర్డు సభ్యులు వెంకటేశ్వరరావు అన్నాప్రగడ, డాక్టర్ బాలాజీ భైరవభట్ల, రవి చెన్నుపాటి, షెర్లిన్ థాయిల్, రాజ్ సామల, రవీంద్ర నల్లూరి, నందితా సేథి, భానుప్రకాశ్ వర్ల, జయేశ్ సంఘ్వీ, అభిజిత్ బెనర్జీ తదితరులు అభినందనలు తెలియజేశారు.