నిమ్స్‌లో చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స
- పుట్టుకతోనే అన్నవాహిక, ఒక కిడ్నీ లేవు
- నాలుగేండ్లుగా పైప్ ద్వారా ద్రవపదార్థాలు
- అరుదైన వ్యాక్టరల్ సిండ్రోమ్‌గా గుర్తింపు
- పైసా ఖర్చు లేకుండా రూ.10లక్షల ఖరీదైన రీకన్స్ట్రక్షన్తో కొత్త జీవితాన్నిచ్చిన వైద్యులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అరుదైన శస్త్రచికిత్సలకు ప్రత్యేక గుర్తింపు పొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోని సర్జికల్ గ్యాస్ట్రో విభాగంలో మరో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. లక్షలో ఒకరికి వచ్చే వ్యాక్టరల్ సిండ్రోమ్ వల్ల అన్నవాహిక లే లేకుండా, ఒకే కిడ్నీతో జన్మించిన నాలుగేండ్ల చిన్నారికి రూ.10 లక్షల ఖరీదైన శస్త్రచికిత్సను సీఎం రిలీఫ్ ఫండ్ కింద పైసా ఖర్చులేకుండా నిర్వహించారు నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రోవైద్యులు. వివరాల్లోకి వెళితే… ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామకు చెందిన బండి కృష్ణ, రమాదేవి దంపతులు జీవనోపాధి కోసం నగరంలోని ఎల్బీనగర్లో ఉంటున్నారు. వీరి ముగ్గురు కూతుళ్లలో చిన్న కూతురు నిశ్విత(4)కు పుట్టుకతోనే అన్నవాహిక, మలద్వారం, ఒక కిడ్నీ లేదు. అంతే కాకుండా ఎడమ వైపు ఉండాల్సిన గుండె నుంచి వచ్చే పెద్ద రక్తనాళం కుడివైపున ఉంది. ఈ విధంగా శరీరంలోని పలు లోపాలుండటాన్ని వైద్యపరిభాషలో ‘వ్యాక్టరల్ సిండ్రోమ్’గా పిలుస్తారని, లక్ష మందిలో ఒకరికి చాలా అరుదుగా వచ్చే సమస్య అని నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డాక్టర్ బీరప్ప తెలిపారు.
పెద్దపేగుతో అన్నవాహిక తయారీ
ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డాక్టర్ బీరప్ప 6 కిలోల బరువు మాత్రమే ఉన్న చిన్నారికి శస్త్రచికిత్స చేయడం చాలా క్లిష్టమైనప్పటికీ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయడానికి అంగీకరించారు. చిన్నారి కడుపులోని పెద్దపేగుతో అన్నవాహిక తయారు చేశారు. అనంతరం ఆ అన్నవాహికను నోటి నుంచి కింద కడుపులోకి అనుసంధానం చేసినట్లు డాక్టర్ బీరప్ప తెలిపారు. 8 మంది వైద్యనిపుణులతో దాదాపు 6 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపారు.
నిమ్స్‌లో ఇదే తొలిసారి: డాక్టర్ బీరప్ప, ప్రొఫెసర్ అండ్ హెచ్‌వోడీ, సర్జికల్ గ్యాస్ట్రో విభాగం
వ్యాక్టరల్ సిండ్రోమ్ అనేది చాలా అరుదుగా కనిపించే జన్యులోపాల వ్యాధి. ఇది మేనరికపు పెండ్లిళ్లు చేసుకున్నవారికి పుట్టే పిల్లల్లో కనిపిస్తుంది. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని మా టీమ్‌ను రెడీ చేశాం. గత నెల 10న రీకన్స్ట్రక్షన్ ద్వారా ఫుడ్పైప్ను నోటి నుంచి పొట్టలోకి జాయిన్ చేశాం. ఇప్పుడు చిన్నారి అందరిలాగానే నోటి ద్వారా ద్రవ పదార్థాలతో పాటు ఘన పదార్థాలను తీసుకుంటున్నది. చిన్నారి పూర్తిగా కోలుకొన్నది. నిమ్స్‌లో ఇప్పటివరకు చిన్నపిల్లలకు ఈ తరహా శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి.
తెలంగాణ సర్కార్‌కు రుణపడి ఉంటాం
మా కూతురికి కొత్త జీవితం ఇచ్చిన నిమ్స్ వైద్యులు, ఆర్థికంగా ఆదుకున్న తెలంగాణ సర్కార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. నిమ్స్ డాక్టర్ బీరప్ప సార్ దేవుని రూపంలో మా చిన్నారికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. బయటి డాక్టర్లు అసాధ్యమన్న సర్జరీను చేసి చూపించి మా పంచప్రాణాలను నిలబెట్టారు. సర్జరీకి అవసరమైన డబ్బులు మా వద్ద లేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా కూతురికి ఆర్థికసాయం చేసిన తెలంగాణ సర్కార్‌కు కృతజ్ఞతలు.
–బండి కృష్ణ, నిశ్విత తండ్రి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

