నల్లమలలో అరుదైన ప్రాణి ఇండియన్ మూన్ మోత్గా గుర్తింపు
అరుదైన ఇండియన్ మూన్ మోత్ నల్లమలలో దర్శనమిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా ఏటీఆర్ పరిధిలోని అభయారణ్యంలో మంగళవారం సాయంత్రం ఈ అరుదైన ప్రాణిని గుర్తించినట్టు హైటికాస్ సంస్థ ప్రతినిధులు గజ్జల బాపురెడ్డి, అఖిల్ తెలిపారు.
అచ్చంపేట, జూన్ 24 : అరుదైన ఇండియన్ మూన్ మోత్ నల్లమలలో దర్శనమిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా ఏటీఆర్ పరిధిలోని అభయారణ్యంలో మంగళవారం సాయంత్రం ఈ అరుదైన ప్రాణిని గుర్తించినట్టు హైటికాస్ సంస్థ ప్రతినిధులు గజ్జల బాపురెడ్డి, అఖిల్ తెలిపారు. ఆకుపచ్చని రంగులో విశాలమైన రెక్కలు, వాటి అంచుల్లో గులాబీ రంగు వెనుక భాగంలో పొడవాటి తోకలు, రెక్కలపై కండ్లను తలపించే వలయాలతో ఈ చిమ్మట ప్రకృతి సృష్టించిన అపురూప కళాఖండంలా ఇది కనిపిస్తున్నది. ప్రపంచంలో అత్యంత అందమైన చిమ్మట జాతుల్లో ‘ఇండియన్ మూన్ మోత్’ ఒకటిగా గుర్తింపు పొందింది.
రాత్రివేళల్లో చురుకుగా సంచరించే ఈ జీవి కృత్రిమ వెలుతురుకు ఆకర్షితమవుతున్నది. ఆరోగ్యకరమైన అడవులు, సమృద్ధిగా జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. గుడ్డు, గొంగళిపురుగు, కోశ దశలో అనేక వారాలు గడిపిన అనంతరం పూర్తిస్థాయి చిమ్మటగా బయటకు వచ్చే ఈ జీవి.. వయోజన దశలో కేవలం 5 నుంచి 8 రోజుల వరకు మాత్రమే జీవిస్తుంది. దీనికి నోరు పనిచేయదు. గొంగళి పురుగు దశలో నిల్వచేసుకున్న శక్తితోనే జీవిస్తూ సంతానోత్పత్తి జరిపి తన జీవన చక్రాన్ని ముగిస్తుంది. నల్లమల అటవీప్రాంత ప్రత్యేకతను ఈ జీవి మరోసారి చాటి చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

