హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : వెలమ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా (వీఏఏ) నూతన అధ్యక్షుడిగా రంగారావు రంగినేని నియామకమయ్యారు. ఈ మేరకు అస్ట్రేలియాలో ఆదివారం కొత్త నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన రెండేండ్లపాటు (2027వరకు) ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన కార్యవర్గానికి మాజీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, ఈ సంఘం 2018లో ఏర్పాటై.. ఆస్ట్రేలియా గడ్డపై తెలంగాణ సంస్కృతిని చాటడంతోపాటు, నిరుపేదలు, పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందజేస్తున్నది.
‘వీఏఏ’ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్హర్రావు సాయినేని, వైస్ ప్రెసిడెంట్‌గా మధుకర్‌రావు రాచమడుగు, జనరల్ సెక్రటరీగా ఎం అ నిల్రావు, పీఆర్వోగా వంశీ గోనె, ట్రెజరర్‌గా కిషన్‌రావు చెప్యాల, జాయింట్ సెక్రటరీగా రామ్శంకర్రావు బోయినపల్లి నియామకమయ్యారు.