Ramoji Rao | కొనసాగుతున్న మీడియా మొఘల్ అంతిమయాత్ర.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఈనాడు గ్రూప్ చైర్మన్, మీడియా మొఘల్ రామోజీ రావు (Ramoji Rao) అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసులు అంతిమ గౌరవం తర్వాత రామోజీ నివాసం నుంచి ఫిల్మ్‌సిటీలోని స్మృతివనం వరకు అంతిమయాత్ర కొనసాగుతున్నది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ చైర్మన్, మీడియా మొఘల్ రామోజీ రావు (Ramoji Rao) అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసులు అంతిమ గౌరవం తర్వాత రామోజీ నివాసం నుంచి ఫిల్మ్‌సిటీలోని స్మృతివనం వరకు అంతిమయాత్ర కొనసాగుతున్నది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫుణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు కడసారి నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వరారావు పాల్గొన్నారు. రామోజీరావును కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
రామోజీ రావు అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. జూన్ 5న తీవ్ర గుండెపోటుతో హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీలో చేరారని, హార్ట్ ఫెయిల్యూర్‌తో పాటు లోబీపీతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేటర్‌పై ఉంచి ఐఏబీపీ సా యంతో ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యాంజియోగ్రామ్ టెస్ట్‌చేసి, స్టంట్వేశామని, అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ బృందాలు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. కాగా, రామోజీరావు తాను బతికుండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి శివారులో ప్రత్యేకంగా స్మృతివనం నిర్మించుకున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

