రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య ఆత్మహత్యాయత్నం?
నటుడు రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌తో చాటింగ్ చేసేముందు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు తెలుపడంతో.. ఆయన హుటాహుటిన డయల్ 112కు కాల్ చేశారు.
- నా చావుకు కారణం రాజ్‌తరుణ్, మాల్వీనే అని లాయర్‌కు మెసేజ్
- లాయర్ అలర్ట్‌తో పోలీసుల రంగప్రవేశం
- లావణ్యకు నార్సింగి పోలీసుల కౌన్సెలింగ్
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ)/మణికొండ : నటుడు రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌తో చాటింగ్ చేసేముందు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు తెలుపడంతో.. ఆయన హుటాహుటిన డయల్ 112కు కాల్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
లావణ్యకు రక్షణ కల్పించాలని, రాజ్‌తరుణ్, అతని తల్లిదండ్రులు, ప్రియురాలు మాల్వీ మల్హోత్రపై చర్యలు తీసుకోవాలని శనివారం లావణ్య న్యాయవాది డీజీపీ జితేందర్‌ను కలిశారు. కేసును త్వరగా పరిష్కరించాలని డీజీపీ ఉన్నతాధికారులకు ఆదేశించారు. లావణ్య ఆత్మహత్యాయత్నం చేస్తూ.. ‘ఈ లోకంలో నా పయనం పూర్తి చేశా. అందుకే వెళ్లిపొతున్నా.
నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు. రాజ్‌తరుణ్ చేతిలో మోసపోయా. మైండ్ గేమింగ్, గాసిప్స్‌తో విసిగిపోయా. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యా. ప్రతిదీ పథకం ప్రకారం జరిగింది. నా చావుకు కారణం రాజ్‌తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వీ మల్హోత్రా’ అంటూ తన లాయర్‌కి మెసేజ్ చేసింది. రాజ్‌తరుణ్ తనని పెండ్లి చేసుకొని, మరొకరితో డేటింగ్లో ఉన్నాడని, తనకు న్యాయం చేయాలని లావణ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

