రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉచిత విద్యుత్కు దరఖాస్తు చేసుకోవాలి
ఉచిత విద్యుత్ | రాష్ట్రంలోని రజకులు, నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

నాగర్ కర్నూల్ : రాష్ట్రంలోని రజకులు, నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కావున జిల్లాలో పై వర్గాలకు చెందిన దుకాణాలు దోబీఘాట్లు కలిగిన రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. ఈ నెల 30 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అందుకు https://tsobmms.cgg.gov.in/ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లాండ్రీలు, హెయిర్ సెలూన్లకు ఈ పథకం వర్తించనుందని, దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు వివరాలు, ఫోన్ నెంబరు, కుల ధ్రువీకరణ పత్రాలు, చిరునామా, విద్యుత్ కమర్షియల్ సంఖ్య, అద్దెకు వ్యాపారం నిర్వహిస్తే రెంటల్ అగ్రిమెంట్, లబ్ధిదారుని ఫొటో, విద్యుత్ బిల్లు, లాండ్రీ లేదా హెయిర్ సెలూన్ ఫొటో, లేబర్ లైసెన్స్ లేదా ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకునేందుకు ఆయా పత్రాలను వినియోగించాలన్నారు.
దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 30 వరకు అవకాశం ఉందన్నారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఈ ధ్రువపత్రాలను జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్ 117 సమర్పించాలని కలెక్టర్ శర్మన్ సూచించారు. లాక్ డౌన్, కరోనా నేపథ్యంలో మధ్యాహ్నం 1:00 వరకే లబ్ధిదారులు ఆన్లైన్లో సమర్పించిన ధృవ పత్రాలను అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

