హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ) : తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా జీ రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా కే మురళీమోహన్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ నెల 19న తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ఫలితాలు ప్రకటించారు.
ఖమ్మం కోర్టు ప్రిన్సిపల్ జడ్జి రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్లుగా జై మైత్రేయి, వైస్ ప్రెసిడెంట్-1గా దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్-2గా జీ వేణు, పీ లక్ష్మీశారదతోపాటు సీహెచ్ సంపత్, శ్రీదేవి, ఎం రాజు, జాయింట్ సెక్రటరీలుగా జే ఉపేందర్‌రావు, గౌస్‌పాషా, కల్పన ఖుష్బూ, గోపీకృష్ణ, పూజ, హిమబిందు, 12 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.