cyclone gulab | హైదరాబాద్‌లో వర్షం.. అప్రమత్తంగా జీహెచ్ఎంసీ
cyclone gulab | గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతున్నది.

హైదరాబాద్: గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతున్నది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్, అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంటలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నది.
హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లిలో వాన పడుతున్నది.
తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగం హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూంచించించి. అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. బాధితులు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే స్పందించాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cyclone Gulab
- GHMC
- Hyderabad
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

