గొడుగుల కింద చదువులు
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 54 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు తరగతి గదులు చిన్నపాటి వర్షానికే కురుస్తుండగా.. విద్యార్థులు ఇంటి నుంచి గొడుగులు తెచ్చుకొని చదువుకుంటున్నారు. భారీ వర్షం పడితే పుస్తకాలు, బ్యాగ్‌లు తడిసి ముద్దవుతున్నాయి.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 54 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు తరగతి గదులు చిన్నపాటి వర్షానికే కురుస్తుండగా.. విద్యార్థులు ఇంటి నుంచి గొడుగులు తెచ్చుకొని చదువుకుంటున్నారు. భారీ వర్షం పడితే పుస్తకాలు, బ్యాగ్‌లు తడిసి ముద్దవుతున్నాయి. గదుల్లో నీరు నిలుస్తుండటంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారని హెచ్ఎం ఇంద్రసింగ్ తెలిపారు. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.
-నెన్నెల
‘అంగన్వాడీ కోడిగుడ్డు’లో పురుగులు
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బంజారాహిల్స్ అంగన్వాడీ కేంద్రంలో 4రోజుల క్రితం అంగన్వాడీ టీచర్ శ్రీలత కోడిగుడ్లను పంపిణీ చేసింది. భూక్య అభినాయక్కు చెందిన చిన్నారులకు ఇచ్చిన కోడిగుడ్లను బుధవారం ఉడకబెట్టి పెంకు తీయగా అందులో పురుగులు కనిపించాయి.
-భువనగిరి
అర్బన్ బురదలో బడికెళ్లేదెట్లా ?
ఎడతెరిపిలేని వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మచ్చాపూర్ రోడ్డు బురదగా మారింది. బుధవారం మచ్చాపూర్ విద్యార్థులను ముత్నూర్ గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలకు తరలిస్తున్న ఆటో ఆ బురదలో దిగబడింది. దీంతో విద్యార్థులు కిందికి దిగి బురదలో దిగబడిన ఆటోను బయటకు నెట్టారు. అనంతరం ఆటోలో బడికి వెళ్లారు. బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
-ఇంద్రవెల్లి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

