30 వరకు వానలు
నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదారాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి, ఇంటీరియర్ ఒడిశా నుంచి దక్షిణ ఒడిశా వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 48 గంటల వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

