Rain | హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాన.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసింది.
హైదరాబాద్: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట, ప్రగతి నగర్, నిజాంపేట, బాచుపల్లి, సైదాబాద్, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్‌లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీకే ఉపరితల గని-2, 3లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కే.సముద్రం మండలం అర్పణపల్లి బ్రిడ్జిపై వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కే.సముద్రం నుంచి గూడూరుకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భారీ వాన పడుతున్నది.
రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడుతుందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

