గువాహటి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ ఎన్నికల అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం చెప్పారు. శివ్సాగర్ జిల్లాలోని నజీరాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శర్మ మీడియాతో మాట్లాడారు.
రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం గువాహటిలోకి ప్రవేశించేందుకు బారికేడ్లను తొలగించాలని కార్యకర్తలను రెచ్చగొట్టినట్లు కేసు నమోదైందని చెప్పారు. హింసను ప్రేరేపించారని, అనంతరం జరిగిన ఘర్షణలో కొందరు కాంగ్రెస్ నేతలు, నలుగురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. డీజీపీ జీపీ సింగ్ మాట్లాడుతూ, ఈ కేసును అస్సాం సీఐడీకి బదిలీ చేసినట్లు తెలిపారు.