హైదరాబాద్: రాహుల్‌గాంధీ డ్రగ్ టెస్టుకు సిద్ధమా అంటూ తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్.. ట్విట్టర్ ఇండియాలో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్నది. #RahulDrugTest హ్యాష్ టాగ్‌తో ఇప్పటికే 12,500 ట్వీట్లు వచ్చాయి. మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ పలువురు ట్విట్టర్ యూజర్లు ట్వీట్లు చేస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కేటీఆర్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ రాహుల్‌గాంధీ డ్రగ్టెస్టుకు సిద్ధమా అంటూ ట్వట్టర్లో ప్రశ్నిస్తున్నారు.
అంతకుముందు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వైట్ ఛాలెంజ్‌పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ కూడా డ్రగ్ టెస్టుకు సిద్ధమైతే తానే డ్రగ్ టెస్టు కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకానీ, చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో కలిసి టెస్టులు చేయించుకోవడం తన స్థాయిని దిగజార్చుకున్నట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. అంతేగాక తనకు డ్రగ్ టెస్టులో క్లీన్చిట్ వస్తే.. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పి, పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.