సాగునీటి రంగంలో కేసీఆర్ అద్భుతాలు
సాగునీటి రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచమే అబ్బురపడేలా అద్భుతాలు సృష్టించారని, అందుకు ఉదాహరణే కాళేశ్వరం ప్రాజెక్టు అని సినీ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. బీఆర్ఎస్ రైతుల కష్టాలు తెలిసిన సర్కార్ అని కొనియాడారు. స్వయంగా తాను నిర్మించి, దర్శకత్వం వహించిన ‘యూనివర్సిటీ’ చిత్రం ప్రమోషన్లో భాగంగా శనివారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చారు.
- కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచ దృష్టినే ఆకర్షించారు
- ప్రముఖ సినీ దర్శక, నిర్మాతఆర్ నారాయణమూర్తి కితాబు
ఖమ్మం, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాగునీటి రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచమే అబ్బురపడేలా అద్భుతాలు సృష్టించారని, అందుకు ఉదాహరణే కాళేశ్వరం ప్రాజెక్టు అని సినీ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. బీఆర్ఎస్ రైతుల కష్టాలు తెలిసిన సర్కార్ అని కొనియాడారు. స్వయంగా తాను నిర్మించి, దర్శకత్వం వహించిన ‘యూనివర్సిటీ’ చిత్రం ప్రమోషన్లో భాగంగా శనివారం ఆయన ఖమ్మం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. తెలంగాణ సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రాంతంలో ఉంటుందని తెలిపారు. గతంలో ఇక్కడ సాగు నీటి వసతులు లేకపోవడంతో ప్రజలు వలస పోయేవారని అన్నారు.
తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టారని కొనియాడారు. అనేక ప్రాజెక్టులు నిర్మించారని, ఫలితంగా నేడు తెలంగాణలో బంగారు పంటలు పండుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. ప్రపంచంలో ఇలాంటి ఎత్తిపోతల ప్రాజెక్టు కెనడాలో ఉండేదని, కానీ ఇప్పుడు ఆ స్థానం కాళేశ్వరం ప్రాజెక్టుకు దక్కిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి ప్రాజెక్టును కేవలం నాలుగేండ్లలో నిర్మించిందని కొనియాడారు. రాష్ట్రం ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని తెలిపారు. మంచి పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు యావత్ తెలంగాణ రైతులు, ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
Doomsday | ఈ నెల 13న యుగాంతం.. ప్రపంచం అంతం కాబోతోందా? 60 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల జోస్యం మళ్లీ వైరల్!
Graduate MLC Elections | సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
Revanth Reddy | రేవంత్‌ను విష్ చేయని పెద్దలు.. పుట్టినరోజున పలుకరించని ఢిల్లీ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

