జీవో 97ను ఉపసంహరించుకోవాలి
జీవో 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేయాలని నిర్ణయించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఆగస్టు 30: జీవో 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేయాలని నిర్ణయించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.
జీవో97 రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలను మహీంద్రా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, దీని వల్ల విద్యార్థులు ఉన్నత విద్య, భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు. పాలిటెక్నిక్ కాలేజీలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచాలని సూచించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

