విదేశీ పర్యటనకు వర్సిటీ వీసీలు!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధభయాలతో విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయి. దీంతో స్వయంగా ప్రధాని మోదీ పొదుపుచర్యలు పాటించాలని ప్రజలకు సూచించారు. కానీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. నలుగురు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు ఏకంగా విదేశీ పర్యటనలకు సిద్ధమయ్యారు.
- డబ్బు దుబారా చేస్తున్నారని విద్యార్థి సంఘాల ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధభయాలతో విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయి. దీంతో స్వయంగా ప్రధాని మోదీ పొదుపుచర్యలు పాటించాలని ప్రజలకు సూచించారు. కానీ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. నలుగురు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు ఏకంగా విదేశీ పర్యటనలకు సిద్ధమయ్యారు. అంతా ప్రముఖ వర్సిటీ వీసీలే కావడం గమనార్హం. హైదరాబాద్‌లోని ఓ వర్సిటీ వీసీ ఈ నెల 17 నుంచి 30 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.
వర్సిటీ పనులు, ఒప్పందాలు, పూర్వ విద్యార్థులను కలిసే పేరిట వీసీలు విదేశాలకు వెళ్తున్నారు. ఒక వీసీ విదేశీ పర్యటన కోసం ఏకంగా రూ. పది లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీసీలు విదేశాలకు వెళ్లడమేంటన్న సందేహాలొస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమానికి వాడాల్సిన సొమ్మును దుబారా చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గవర్నర్ జోక్యం చేసుకుని దుబారాకు చెక్‌పెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

